శనివారం 28 మార్చి 2020
Sports - Mar 06, 2020 , 16:58:19

హార్దిక్‌ విధ్వంసం.. 55 బంతుల్లో 158 నాటౌట్‌

హార్దిక్‌  విధ్వంసం.. 55 బంతుల్లో 158 నాటౌట్‌

ముంబై: పూర్తి ఫిట్‌నెస్‌ సాధించిన టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య డీవీ పాటిల్‌ టీ20 కప్‌లో దుమ్మురేపుతున్నాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న పాండ్య బ్యాటుతో పెను విధ్వంసం సృష్టించాడు. భారత జట్టులో రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న  హార్డ్‌హిట్టర్‌  సెమీస్‌ పోరులో కేవలం 55 బంతుల్లో 158 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు‌. రిలయన్స్‌ 1 జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హార్దిక్‌.. బీపీసీఎల్‌ బౌలర్లపై  విరుచుకుపడ్డాడు.  హార్దిక్‌ తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 6ఫోర్లు, 20సిక్సర్లు బాదడం విశేషం. 

హార్దిక్‌ వీరవిహారం చేయడంతో  రిలయన్స్‌ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 238 పరుగులు చేసింది. కొన్ని నెలల క్రితం శస్త్రచికిత్స చేయించుకున్న హార్దిక్‌  కొద్దిరోజుల క్రితమే మైదానంలో అడుగుపెట్టాడు.  10/2తో కష్టాల్లో ఉన్న దశలో క్రీజులోకి వచ్చిన పాండ్య ఆఖరి వరకు ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేశాడు. అనంతరం ఛేదనలో బీపీసీఎల్‌ జట్టు 15.4 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. దీంతో రిలయన్స్‌ టీమ్‌ 134 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. logo