శనివారం 23 జనవరి 2021
Sports - Nov 27, 2020 , 17:12:42

ప్చ్‌..హార్డిక్‌ పాండ్య 90 ఔట్‌

ప్చ్‌..హార్డిక్‌ పాండ్య 90 ఔట్‌

సిడ్న:ఆస్ట్రేలియా నిర్దేశించిన 375 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ తడబడుతోంది. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్న శిఖర్‌ ధావన్(74)‌, హార్దిక్‌ పాండ్య(90) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్‌ చేరడంతో భారత్‌ ఓటమి దాదాపుగా ఖరారైంది. ఫామ్‌లో ఉన్న స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ జట్టును లక్ష్యం దిశగా నడిపించారు.  క్రీజులో కుదురుకున్న జోడీని స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా విడదీశాడు. దీంతో 128 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది.  

విచిత్రంగా జంపా బౌలింగ్‌లో ధావన్‌, పాండ్య ఇద్దరు కూడా స్టార్క్‌ చేతికి చిక్కారు.  ప్రస్తుతం జడేజా(14), నవదీప్‌ సైనీ(3) క్రీజులో ఉన్నారు. 42 ఓవర్లకు టీమ్‌ఇండియా 6 వికెట్లకు 256 రన్స్‌ చేసింది.  భారత్‌ విజయానికి ఇంకా 48 బంతుల్లో 119 పరుగులు చేయాల్సి ఉంది.  టెయిలెండర్లు అసాధారణ ప్రదర్శన చేస్తే భారత్‌ గెలిచే అవకాశం ఉంది.  


logo