శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Mar 10, 2020 , 17:30:41

హోలీ సంబురాల్లో హార్దిక్‌, నటాషా..

హోలీ సంబురాల్లో హార్దిక్‌, నటాషా..

ముంబయి: టీమిండియా ఆల్‌రౌండర్‌ హర్ధిక్‌ పాండ్యా.. తనకు కాబోయే భార్య నటాషా స్టాంకోవిక్‌తో కలిసి హోలీ వేడుకను ఘనంగా జరుపుకున్నాడు. తన నివాసంలో నటాషా, సోదరుడు, టీమిండియా ఆటగాడైన కృనాల్‌ పాండ్యాతో కలిసి రంగులు జల్లుకున్నారు. హోలీ వేడుకలు జరుపుకున్న ఫోటోలను పాండ్యా.. ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘హ్యాపీ హాలీడేస్‌ ఫ్రమ్‌ పాండ్యాస్‌.. లవ్‌ హోలీ, హాయ్‌’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. ఈ ఫోటోల్లో పాండ్యా బ్రదర్స్‌, నటాషా రంగుల్లో మెరిసిపోతున్నారు. పాండ్యా ఫోటోలను ట్విట్టర్‌లో పోస్టు చేయగానే.. సోషల్‌ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. లవ్‌ యూ పాండ్యా అంటూ రిైప్లె ఇస్తున్నారు. హార్దిక్‌, నటాషా.. జనవరి 1, 2020న ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు.

హార్దిక్‌ పాండ్యా.. త్వరలో దక్షిణాఫ్రికాతో తలపడనున్న ఇండియా జట్టులో చోటు దక్కించుకున్నాడు. గాయం కారణంగా కొద్ది నెలలుగా హార్దిక్‌ జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఇటీవల ముంబయిలో జరిగిన డీవై పాటిల్‌ టీ-20 కప్‌లో వరుస సెంచరీలతో చెలరేగాడు. ఓ మ్యాచ్‌లో అయితే కేవలం 55 బంతుల్లో 158 పరుగులు చేశాడు. 20 సిక్సులు, 6 బౌండరీలతో విరుచుకుపడ్డ హార్దిక్‌.. తన జట్టుకు ఘనవిజయాన్ని అందించాడు.logo