మంగళవారం 19 జనవరి 2021
Sports - Dec 03, 2020 , 13:07:51

వ్యాక్సిన్ అవ‌స‌రమా అన్న హ‌ర్భ‌జ‌న్‌.. ఆడుకున్న నెటిజ‌న్లు!

వ్యాక్సిన్ అవ‌స‌రమా అన్న హ‌ర్భ‌జ‌న్‌.. ఆడుకున్న నెటిజ‌న్లు!

ఫైజ‌ర్ వ్యాక్సిన్ 94 శాతం స‌మ‌ర్థ‌వంతం.. అలాగే ఆక్స్‌ఫ‌ర్డ్ 90 శాతం, మోడెర్నా 94.5 శాతం స‌మ‌ర్థ‌వంతం అని ప్ర‌క‌టించుకున్నాయి. అదే ఇండియాలో ఏ వ్యాక్సినూ లేకుండానే 93.6 శాతం మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇప్పుడు చెప్పండి.. ఇండియాకు అస‌లు వ్యాక్సిన్ అవ‌స‌ర‌మా అని ట్విట‌ర్‌లో మాజీ క్రికెట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ వేసిన ప్ర‌శ్న‌ల‌కు నెటిజ‌న్ల నుంచి చాలా ఘాటైన స‌మాధాన‌మే వ‌చ్చింది. అత‌ను ట్వీట్ చేసిన‌ప్ప‌టి నుంచీ ట్విట‌ర్ యూజ‌ర్లు విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు. కాస్త లాజిక్‌తో ఆలోచించు అని ఒక‌రు.. ఇలాంటి పిచ్చి పోస్ట్‌లు చేయ‌కు అని మ‌రొక‌రు భ‌జ్జీపై మండిప‌డ్డారు. 140 కోట్ల మందిలో 6.4 శాతం మంది అంటే ఎంతో తెలుసా.. అంత మంది పోతేపోనీ అని అనుకుంటున్నావా అని ఓ యూజ‌ర్ నిల‌దీశాడు. ఓ స్పిన్న‌ర్ బౌలింగ్ చేస్తుంటే ప్యాడ్స్ ఎందుకు.. బాల్ త‌గిలినా త‌ట్టుకునేంత బ‌ల‌మైన ఎముక‌లు ఉన్నాయి క‌దా అని మ‌రొక యూజ‌ర్ హేళ‌న చేశాడు.