బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Sep 04, 2020 , 13:01:11

ఐపీఎల్‌కు హర్బజన్‌ సింగ్‌ దూరం?

ఐపీఎల్‌కు  హర్బజన్‌ సింగ్‌ దూరం?

దుబాయ్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) జట్టుకు మరో కీలక ఆటగాడు దూరమయ్యే అవకాశం ఉన్నది.  సీనియర్‌ స్పిన్నర్‌  హర్బజన్‌ సింగ్‌  రాబోయే ఐపీఎల్‌ 2020  సీజన్‌ నుంచి తప్పుకునేలా ఉన్నాడు. భారత్‌ నుంచి యూఏఈ వెళ్లిన చెన్నై టీమ్‌తో పాటు హర్బజన్‌ వెళ్లకపోయినప్పటికీ తర్వాత అక్కడికి వెళ్తాడని భావించారు. కానీ, వ్యక్తిగత కారణాలతోనే భజ్జీ ఇంకా యూఏఈ వెళ్లలేదు.    అంతకుముందు చెన్నైలో నిర్వహించిన  శిబిరంలో కూడా అతడు పాల్గొనలేదు.   

ఈ ఏడాది సీజన్‌ నుంచి వైదొలుగుతున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల కానప్పటికీ హర్బజన్‌ లేకుండానే  చెన్నై టీమ్‌ టోర్నీ కోసం సన్నద్ధమవుతున్నది. టోర్నీలో పాల్గొనాలా వద్దా అనే విషయంపై అతడు ఇవాళ క్లారిటీ ఇవ్వనున్నాడు.   చెన్నై టీమ్‌లో ఇద్దరు ఆటగాళ్లతో పాటు మరో 11 మంది సభ్యులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. 


logo