శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Aug 20, 2020 , 12:37:18

ధోనీసేనతో భజ్జీ యూఏఈ వెళ్లకపోవచ్చు!

 ధోనీసేనతో భజ్జీ యూఏఈ వెళ్లకపోవచ్చు!

చెన్నై:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 2020 సీజన్‌ కోసం అన్ని ఫ్రాంఛైజీలు యూఏఈకి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నాయి.  మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) శుక్రవారం  దుబాయ్‌ బయలుదేరేందుకు సిద్ధమైంది. వెటరన్‌ ఆఫ్‌స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ చెన్నై ఆటగాళ్లతో శుక్రవారం దుబాయ్‌ వెళ్లకపోవచ్చని సమాచారం.   తన తల్లి అనారోగ్యం కారణంగా హర్భజన్‌ ఆటగాళ్లతో కలిసి ప్రయాణించకూడదని నిర్ణయించుకున్నాడు. 

ఇప్పటికే ఆటగాళ్ల కోసం చెన్నైలో ఐదు రోజుల పాటు ఏర్పాటు చేసిన  స్ట్రెంగ్త్‌ అండ్‌ కండిషనింగ్‌ క్యాంప్‌కు దూరమయ్యాడు. తన తల్లి అనారోగ్య పరిస్థితి గురించి ఫ్రాంఛైజీకి భజ్జీ తెలియజేశాడు. రెండు వారాల్లో దుబాయ్‌లో జట్టుతో కలవనున్నాడు.  సెప్టెంబర్‌ 19న యూఏఈలో ఐపీఎల్‌-13వ సీజన్‌ ఆరంభంకానుంది. 


logo