బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Mar 27, 2020 , 16:09:14

పోలీసులపై దాడి చేస్తారా..? భజ్జీ గుస్సా

పోలీసులపై దాడి చేస్తారా..? భజ్జీ గుస్సా

ముంబై: లాక్​డౌన్​ నిబంధనలు పాటించాలని చెప్పిన పోలీసుల మీద.. దాడికి పాల్పడిన వారిపై టీమ్​ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అందరి కోసం జీవితాలను పణంగా పెట్టి పోలీసులు పని చేస్తున్నారని, వారిని ప్రతిఘటించడమేంటని ప్రశ్నించాడు. ఈ సందర్భంగా పోలీసులపై కొందరు దాడి చేసిన ఓ వీడియోను ట్విట్టర్​లో పోస్ట్ చేశాడు. ‘పోలీసుల పట్ల మన ఆలోచనాతీరు, ప్రవర్తన మారాలి. జీవితాలను పణంగా పెట్టి వారు మన జీవితాలను కాపాడేందుకు పని చేస్తున్నారని మరువకూడదు. వారికి కూడా కుటుంబాలు ఉన్నాయి. కానీ వారు దేశం కోసం విధులు నిర్వర్తిస్తున్నారు. మంచి భవిష్యత్తు కోసం ఎందుకు ఇండ్లలో ఉండకూడదు.. దయచేసి సక్రమంగా ఉండండి’ అని హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు.


logo