శనివారం 04 జూలై 2020
Sports - Jun 06, 2020 , 16:37:27

భజ్జీ స్థానంలో మరొకరు ఉంటేనా..

భజ్జీ స్థానంలో మరొకరు ఉంటేనా..

న్యూఢిల్లీ  భారత మాజీ ఆఫ్‌స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌పై దిగ్గజ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ప్రశంసలు కురిపించారు. భారత క్రికెట్‌కు అతడు అందించిన సేవలను కొనియాడుతూ..ఒత్తిడి, వ్యక్తిగత జీవితంలో ఎదురైనా సవాళ్లను ఈజీగా అధిగమించాడని తెలిపాడు.  

' కెరీర్‌ ఆరంభంలో హర్భజన్‌ సింగ్‌ వ్యక్తిగత జీవితం, ప్రొఫెషనల్‌  కెరీర్‌లో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు.  భజ్జీ స్థానంలో ఇంకెవరైనా ఉంటే కచ్చితంగా పరిస్థితులకు తలొగ్గేవారు.  తీవ్ర ఒత్తిడి ఎదుర్కొని దశాబ్దంన్నర పాటు తనదైన శైలిలో  భారత క్రికెట్‌కు సేవలందించాడు. అతడు తీవ్ర నిరాశను కూడా  దూకుడుగా ఉండేందుకు  ఉపయోగించుకున్నాడని'  వీవీఎస్‌ పేర్కొన్నాడు. 

2001లో ఈడెన్‌ గార్జెన్స్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన చరిత్రాత్మక రెండో టెస్టు మ్యాచ్‌లో భజ్జీ 13 వికెట్లు పడగొట్టాడు. ఆ మ్యాచ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో  లక్ష్మణ్‌(281), రాహుల్‌ ద్రావిడ్‌(180) రాణించడంతో భారత్‌ ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ వికెట్లు తీసి భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో  ఈ రికార్డు నెలకొల్పిన తొలి ఆటగాడిగా భజ్జీ నిలిచాడు.


logo