సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Aug 05, 2020 , 19:06:06

ప్రాక్టీస్ షురూ చేసిన ప్రపంచ చాంపియన్ పీవీ సింధు

ప్రాక్టీస్ షురూ చేసిన ప్రపంచ చాంపియన్ పీవీ సింధు

హైదరాబాద్​: బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్, తెలుగు స్టార్ షట్లర్ పీవీ సింధు ట్రైనింగ్​ను పునఃప్రారంభించింది. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జిమ్​లో పూర్తిస్థాయి కసరత్తులు చేయడం సంతోషంగా అనిపించిందని సింధు చెప్పింది. అన్​లాక్​-3లో భాగంగా బుధవారం నుంచి జిమ్​లకు అనుమతులు లభించడంతో.. హైదరాబాద్​లోని సుచిత్ర అకాడమీలో సింధు బుధవారం ప్రాక్టీస్ మొదలుపెట్టింది. దాదాపు మూడు గంటల పాటు చెమటోడ్చింది.

“రెండు వారాల పాటు సీనియస్​గా ట్రైనింగ్ తీసుకుంటే మళ్లీ గతంలోలాగా ఫిట్​గా తయారవుతాను. కొంచెం కష్టం, అసాధ్యం మాత్రం కాదు. లాక్​డౌన్​లో కొంత చిరాకుగా అనిపించింది. అయితే మళ్లీ ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది. నాకు సుచిత్ర అకాడమీ చాలా అనుకూలమైన ప్రదేశంలా అనిపిస్తుంది. ప్లేయర్​గా పోటీల కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అలాగే ఆటను మెరుగుపరుచుకునేందుకు నేను ప్రతీరోజు శ్రమిస్తా. చాలో రోజుల తర్వాత పూర్తిస్థాయి జిమ్​సెషన్లో పాల్గొనడం సంతోషంగా ఉంది” అని పీవీ సింధు చెప్పింది. కాగా కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం బ్యాడ్మింటన్ టోర్నీలన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. 


logo