శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Sports - Jan 18, 2021 , 16:30:29

మంత్రి కేటీఆర్‌ను కలిసిన క్రికెటర్‌ హనుమ విహారి

మంత్రి కేటీఆర్‌ను కలిసిన క్రికెటర్‌ హనుమ విహారి

హైదరాబాద్‌: టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ హనుమ విహారి  సోమవారం  తెలంగాణ ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా  కలిశాడు.  ఆసీస్‌ గడ్డపై చిరస్మరణీయ ప్రదర్శన చేసిన విహారిని మంత్రి కేటీఆర్‌ శాలువాతో సన్మానించారు.  ఆసీస్‌ పర్యటనకు సంబంధించిన విషయాలను విహారీ..కేటీఆర్‌కు వివరించాడు. మిమ్మల్ని కలవడం,  క్రికెట్ గురించి సంభాషించడం చాలా ఆనందంగా ఉందని విహారి ట్విటర్లో పేర్కొన్నాడు. కేటీఆర్‌తో దిగిన ఫొటోను తెలుగు క్రికెటర్‌ షేర్‌ చేశాడు. 

ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో  అద్భుత డిఫెన్స్‌తో ఆకట్టుకున్న హనుమ విహారీ , రవిచంద్రన్ అశ్విన్ మ్యాచ్ డ్రాగా ముగియడంలో  కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తొడకండరాల గాయం కారణంగా విహారి ఆఖరిదైన నాలుగో టెస్టుకు దూరంకావడంతో ఇటీవల స్వదేశం చేరుకున్నాడు.   మూడో టెస్టును టీమ్‌ఇండియా  డ్రా చేసుకోవడంపై మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో స్పందించిన విషయం తెలిసిందే. టెస్టు డ్రా..ఇన్నింగ్స్‌ విజయం కన్నా బాగుందని ప్రశంసించారు. 


VIDEOS

logo