విహారి జోరు.. పంత్ హోరు

సిడ్నీ: ఆతిథ్య ఆస్ట్రేలియాతో తొలి టెస్టు(గులాబీ) సన్నాహకంగా జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు. ఆస్ట్రేలియా- ఎ టీమ్‌తో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో గులాబీ బంతితో జరుగుతున్న వామప్ మ్యాచ్‌లో భారత్ భారీ ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ పృథ్వీ షా(3) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ అద్భుతంగా రాణించారు. ఏకంగా నలుగురు ఆటగాళ్లు 50+ స్కోరు సాధించారు. కీలకమైన మిడిలార్డర్లో హనుమ విహారి(104 నాటౌట్), యువ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్(103 నాటౌట్) శతకాలతో విజృంభించారు.
పంత్ టీ20 తరహాలో రెచ్చిపోయి 73 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విల్డర్మత్ వేసిన ఇన్నింగ్స్ 90వ ఓవర్లో పంత్ ఒక్కడే నాలుగు ఫోర్లు, సిక్సర్ బాది 22 రన్స్ రాబట్టాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో విహారికిది 21వ శతకం కావడం విశేషం. మయాంక్ అగర్వాల్(61), శుభ్‌మన్ గిల్(65), రహానె(38) గులాబీ బంతిని సమర్థంగా ఎదుర్కొన్నారు. ఆస్ట్రేలియా-ఏ బౌలర్లలో మార్క్ స్టీకెటీ రెండు వికెట్లు తీయగా విల్డర్మత్, స్వెప్సన్ చెరో వికెట్ పడగొట్టారు. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 386 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని భారత్ 472 పరుగుల ఆధిక్యంలో ఉంది.
That's stumps after another big day of cricket in Sydney! #AUSAvIND
— cricket.com.au (@cricketcomau) December 12, 2020
SCORECARD: https://t.co/7h4rdQDzHV pic.twitter.com/NK4whyzPWZ
తాజావార్తలు
- హైదరాబాద్‌లో టీకా పరీక్ష, ధ్రువీకరణ కేంద్రం ఏర్పాటుపై పరిశీలన
- రా రమ్మంటాయి..ఆనందాన్నిస్తాయి
- కమలా హ్యారిస్ పర్పుల్ డ్రెస్ ఎందుకు వేసుకున్నారో తెలుసా ?
- చంపేస్తామంటూ హీరోయిన్‌కు బెదిరింపు కాల్స్..!
- అమెరికా అధ్యక్షుడు ఫాలో అవుతున్న ఆ ఏకైక సెలబ్రిటీ ఎవరో తెలుసా?
- బైడెన్‌కు ఆ "బిస్కెట్" ఇవ్వకుండానే వెళ్లిపోయిన ట్రంప్
- ఆర్మీ నకిలీ ఐడీకార్డులు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్
- ఎస్బీఐ పీఓ మెయిన్ అడ్మిట్ కార్డుల విడుదల
- కరోనా టీకా తీసుకున్న ఆశా వర్కర్‌కు అస్వస్థత
- క్లినిక్ బయట ఫొటోలకు పోజులిచ్చిన కోహ్లి, అనుష్క