బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Feb 27, 2020 , 00:48:27

హ్యాండ్‌బాల్‌ టోర్నీ షురూ

హ్యాండ్‌బాల్‌ టోర్నీ షురూ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి:  పదకొండు రాష్ర్టాల జట్లు పాల్గొంటున్న ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ్‌ భారత్‌ టోర్నీ ఘనంగా ప్రారంభమైంది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా మూడు రోజుల పాటు జరుగున్న  పోటీలను బుధవారం జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం ఉపాధ్యక్షుడు అరిశనపల్లి జగన్‌మోహన్‌రావు ప్రారంభించారు. ఈ టోర్నీలో తెలంగాణతో పాటు హర్యానా, గుజరాత్‌, కేరళ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, త్రిపుర, బీహార్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, అండమాన్‌ నికోబార్‌ జట్లు పాల్గొంటున్నాయి. టోర్నీ ప్రారంభ కార్యక్రమంలో సాట్స్‌ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి, సాయ్‌ హస్టల్‌ డైరెక్టర్‌ శ్రీలత రెడ్డి, తెలంగాణ రాష్ట్ర హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి పవన్‌ కుమార్‌ ఇండియన్‌ టీమ్‌ హ్యాండ్‌ బాల్‌ కోచ్‌ రవి కుమార్‌, హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ రిఫరీ బోర్డు కన్వినర్‌ ఇంద్రసేనరెడ్డి, గోకుల్‌, తదితరులు పాల్గొన్నారు.


logo