ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Sep 14, 2020 , 02:02:10

హామిల్టన్‌@ 90టస్కన్‌ గ్రాండ్‌ప్రి కైవసం

హామిల్టన్‌@ 90టస్కన్‌ గ్రాండ్‌ప్రి కైవసం

 ముగెల్లో: ఫార్ములా వన్‌ ప్రపంచ చాంపియన్‌, మెర్సిడెజ్‌ స్టార్‌ రేసర్‌ లూయిస్‌ హామిల్టన్‌.. టస్కన్‌ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం ఇక్కడ జరిగిన రేసులో అందరి కంటే ముందు లక్ష్యాన్ని చేరిన లూయిస్‌ తన కెరీర్‌లో 90వ టైటిల్‌ను అందుకున్నాడు. ఫార్ములావన్‌ ఆల్‌టైం గ్రేట్‌ మైకేల్‌ షూమాకర్‌(91) అత్యధిక టైటిళ్ల రికార్డుకు ఒక్క అడుగు సమీపానికి చేరాడు. కాగా రెండు అవాంతరాలతో పాటు నాటకీయంగా సాగిన ఈ రేస్‌లో మెర్సిడెజ్‌కే చెందిన వాల్తేరి బొటాస్‌ రెండో స్థానం దక్కించుకోగా.. రెడ్‌బుల్‌ డ్రైవర్‌ అలెగ్జాండర్‌ అల్బాన్‌ మూడో స్థానంలో నిలిచాడు. 


logo