గురువారం 02 జూలై 2020
Sports - Jun 23, 2020 , 08:40:18

జాతి వివక్ష వ్యతిరేక ర్యాలీలో హామిల్టన్‌

 జాతి వివక్ష వ్యతిరేక ర్యాలీలో హామిల్టన్‌

లండన్‌: నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యపై ఫార్ములా వన్‌ స్టార్‌ రేసర్‌ లూయిస్‌ హామిల్టన్‌ గళమెత్తాడు. పోలీసుల చేతిలో ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా లండన్‌లో జరిగిన ర్యాలీలో హామిల్టన్‌ కదం కదం కలిపాడు. వెంట్‌డౌన్‌ నుంచి హైడ్‌పార్క్‌ వరకు జరిగిన శాంతియుత ప్రదర్శనలో తాను పాల్గొనడం గర్వంగా ఉందని అన్నాడు. ఫార్ములా వన్‌లో ఏకైక నల్లజాతి రేసర్‌గా కొనసాగుతున్న హామిల్టన్‌ ..ర్యాలీలో పాల్గొనడంపై స్పందిస్తూ ‘బ్లాక్‌ లివ్స్‌ మ్యాటర్‌ ఉద్యమంలో పాలుపంచుకోవడం గర్వంగా ఉంది. సమానత్వం కోసం జరిగిన ఈ ప్రదర్శనలో శ్వేత జాతీయులు పాల్గొనడం సంతోషంగా ఉంది’ అని అన్నాడు. 


logo