బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Mar 21, 2020 , 22:46:15

స్వీయ నిర్బంధంలో హామిల్టన్‌

 స్వీయ నిర్బంధంలో హామిల్టన్‌

లండన్‌: ఫార్ములావన్‌ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ గత వారం రోజులుగా స్వీయ నిర్బంధాన్ని పాటిస్తున్నట్లు ప్రకటించాడు. లండన్‌ వేదికగా మార్చి 4న జరిగిన ఓ చారిటీ కార్యక్రమంలో హాలీవుడ్‌ యాక్టర్‌ ఇద్రిస్‌ ఎల్బా, కెనడా ప్రధాని భార్య సోఫి యా గ్రెగొయిర్‌ ట్రూడూతో కలిసి హామిల్టన్‌ పాల్గొన్నాడు. ఆ తర్వాత వారిద్దరికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో.. ఈనెల 13 నుంచి హామిల్టన్‌ ఇంటికే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో శనివారం సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో ద్వారా తన అనుభవాలు పంచుకున్నాడు.


logo