శుక్రవారం 05 మార్చి 2021
Sports - Feb 01, 2021 , 03:07:28

హుస్నాబాద్‌లో హుషారుగా

 హుస్నాబాద్‌లో హుషారుగా

హుస్నాబాద్‌: హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలోనే తొలిసారి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో హాఫ్‌ మారథాన్‌ ఉత్సాహంగా జరిగింది. ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌ కుమార్‌, సిద్దిపేట సీపీ జోయల్‌ డెవిస్‌ ఆదివారం ఉదయం పట్టణంలోని స్థూపం వద్ద పచ్చ జెండా ఊపి హాఫ్‌ మారథాన్‌ (21 కిలోమీటర్ల పరుగు), 10కే రన్‌, 5కే రన్‌ పోటీలను ప్రారంభించారు. హాఫ్‌ మారథాన్‌లో 284 మంది, 10కే రన్‌లో 173 మంది, 5కే రన్‌ పురుషుల విభాగంలో 513 మంది, మహిళల విభాగంలో 84 మంది పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న అందరికీ పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. 

VIDEOS

logo