ఆదివారం 24 జనవరి 2021
Sports - Dec 06, 2020 , 16:49:14

ధావన్‌, శాంసన్‌ ఔట్‌..కష్టాల్లో భారత్‌

ధావన్‌, శాంసన్‌ ఔట్‌..కష్టాల్లో భారత్‌

సిడ్నీ: ఆస్ట్రేలియాతో రెండో టీ20లో భారత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(52) అర్ధసెంచరీ సాధించాడు.  టీ20ల్లో అతనికిది 11వ హాఫ్‌సెంచరీ కావడం విశేషం. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి జోరుగా బ్యాటింగ్‌ చేస్తున్న ధావన్‌..జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌ చేరాడు.  ఆసీస్‌ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బంతులేస్తుండటంతో పవర్‌ప్లే ఆనంతరం భారత్‌ పరుగులు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. 34 బంతుల్లో 50 మార్క్‌ చేరుకున్న ధావన్‌ వేగంగా ఆడే క్రమంలో వికెట్‌ చేజార్చుకున్నాడు.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్(15)‌..డేనియల్‌ సామ్స్‌ బౌలింగ్‌లో ఫోర్‌,సిక్సర్‌ బాది ఊపుమీద కనిపించాడు. స్వెప్సన్‌ వేసిన తర్వాతి ఓవర్లోనే సంజూ కూడా ఔటవడంతో భారత్‌పై ఒత్తిడి పెరిగింది. మరో ఎండ్‌లో విరాట్‌ కోహ్లీ(20) నిలకడగా ఆడుతున్నాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య(3) మెరుపులు మెరిపించాలని భారత్‌ ఆశిస్తోంది.  భారత్‌ విజయానికి ఇంకా 37 బంతుల్లో 73 రన్స్‌ చేయాల్సి ఉంది. 14 ఓవర్లకు టీమ్‌ఇండియా 3 వికెట్లకు 123 పరుగులు చేసింది. 


logo