బుధవారం 28 అక్టోబర్ 2020
Sports - Sep 22, 2020 , 03:02:22

ఇటాలియన్‌ ఓపెన్‌ విజేత హలెప్‌

ఇటాలియన్‌ ఓపెన్‌ విజేత హలెప్‌

  రోమ్‌: రొమేనియా స్టార్‌ సిమోనా హలెప్‌ మళ్లీ గెలుపు బాట పట్టింది. కరోనా వైరస్‌ కారణంగా దాదాపు ఐదు నెలలు ఆటకు దూరమైన హలెప్‌..ఇటాలియన్‌ ఓపెన్‌లో మెరిసింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ హలెప్‌ 6-0, 2-1తో కరోలినా ప్లిస్కోవాపై విజయం సాధించింది. తొలి సెట్‌ను అలవోకగా నెగ్గి హలెప్‌ దూకుడు మీదున్న సమయంలో ప్లిస్కోవా గాయపడింది. ట్రైనర్‌తో చికిత్స చేయించుకున్నా లాభం లేకపోవడంతో మ్యాచ్‌ మధ్యలోనే ప్లిస్కోవా నిష్క్రమించడంతో హలెప్‌ను ట్రోఫీ వరించింది. పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను సెర్బియా స్టార్‌ జొకోవిచ్‌ కైవసం చేసుకున్నాడు. 


logo