టోక్యో: జపాన్ సంప్రదాయక క్రీడ సుమోలో ఒక అధ్యాయం ముగిసింది. సుదీర్ఘ కాలం పాటు తన అద్భుత ప్రతిభతో చిరస్మరణీయ విజయాలు సాధించిన సుమో దిగ్గజం హకుహో ఆటకు అల్విదా
(వీడ్కోలు) పలికాడు. సుమోలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న 36 ఏండ్ల మోకాలి గాయం కారణంగా ఆటకు దూరమవుతున్నట్లు స్థానిక వార్తాసంస్థ సోమవారం పేర్కొంది. మంగోలియాలో 1985లో జన్మించిన ఈ సుమో రెజ్లర్..15ఏండ్ల ప్రాయంలో రింగ్‌లోకి అడుగుపెట్టాడు. 2001లో తొలి టైటిల్ దక్కించుకున్న హకుహో 21 ఏండ్ల కెరీర్లో రికార్డు స్థాయిలో 1187 విజయాలు సొంతం చేసుకున్నాడు. గత మార్చిలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న ఈ దిగ్గజ రెజ్లర్..రిటైర్మెంట్ తర్వాత యువకులకు శిక్షణనిస్తానని తెలిపాడు. హకుహో నిష్క్రమణతో జపాన్‌లో టెరున్ఫుజి టాప్ ర్యాంక్‌కు చేరుకున్నాడు.