ఆదివారం 05 జూలై 2020
Sports - Jun 25, 2020 , 00:27:56

ఒక్కరోజు తేడాలో.. పాజిటివ్‌.. నెగిటివ్‌

ఒక్కరోజు తేడాలో.. పాజిటివ్‌.. నెగిటివ్‌

కరాచీ: పాకిస్థాన్‌ ఆల్‌రౌండర్‌ మహమ్మద్‌ హఫీజ్‌కు కరోనా నెగిటివ్‌ అని తేలింది. మంగళవారం పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు నిర్వహించిన కొవిడ్‌-19 పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. బుధవారం హఫీజ్‌ వ్యక్తిగతంగా చేయించుకున్న టెస్టుల్లో వైరస్‌ లేదని వెల్లడైంది. ‘నా సంతృప్తి కోసం కుటుంబంతో సహా మరోసారి పరీక్షలు చేయించుకున్నా. నాతో పాటు మావాళ్లందరికీ నెగిటివ్‌ వచ్చింది’ అని హఫీజ్‌ ట్వీట్‌ చేశాడు.


logo