మంగళవారం 14 జూలై 2020
Sports - Jun 30, 2020 , 00:24:29

కరోనా సోకినా.. గుర్తించలేకపోయా: బోథమ్‌

కరోనా సోకినా.. గుర్తించలేకపోయా:  బోథమ్‌

లండన్‌: ఈ ఏడాది మొదట్లో తాను కరోనా వైరస్‌ బారిన పడినట్లు ఇంగ్లండ్‌ దిగ్గజ క్రికెటర్‌ ఇయాన్‌ బోథమ్‌ చెప్పుకొచ్చాడు. అయితే తొలుత కరోనా వైరస్‌ అనుకోలేదని, ఏదో ఒక ఫ్లూగా భావించానని  వివరించాడు. ఓ బ్రిటన్‌ వార్తా సంస్థకు సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో బోథమ్‌  ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘డిసెంబర్‌ ఆఖరు, జనవరి మొదట్లో నేను కరోనా  బారిన పడ్డాను. కానీ వైరస్‌ కాకుండా ఫ్లూ కావచ్చన్న భ్రమలో ఉండిపోయాను. క్రికెట్‌ పునరుద్ధరణ త్వరలో జరుగుతుందని అనుకుంటున్నా’ అని బోథమ్‌ అన్నాడు. 


logo