టోక్యో: పారాలింపిక్స్‌లో ఆమెకు మెడల్ దక్కలేదు. కానీ ఎంగేజ్మెంట్ రింగ్ చిక్కింది. కేప్ వర్డే దేశానికి చెందిన స్ప్రింటర్ కౌలా నిద్రేయి పెరీరా సిమెడో .. సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టినా.. ఆ ట్రాక్‌పైనే ఆమెకు జీవిత భాగస్వామి దొరికేశాడు. అంధ అథ్లెట్ అయిన పెరీరా.. 200 మీటర్స్ ఈవెంట్ హీట్స్‌లో నాలుగవ స్థానంలో నిలిచింది. అయితే ఆమెతో కలిసి పరిగెత్తిన గౌడ్ మాన్యువల్ ఆంటోనియో వాజ్ ద వేగా ఇప్పుడు ఆమెకు తోడూనీడయ్యాడు. పారాలింపిక్స్‌లో గుడ్డి అథ్లెట్లు పరుగు తీస్తుంటే.. వారికి తోడుగా గైడ్లు ఉంటారు. ఆ ఇద్దరి చేతుల్ని కట్టేసి పరుగెత్తిస్తారు.
అయితే ఫినిష్ లైన్ పూర్తి చేసిన వెంటనే .. పెరీరాకు ఆమె గైడ్ ప్రపోజ్ చేశాడు. మోకాళ్లపై కూర్చుని పెరీరాకు తన ప్రేమను వ్యక్తపరిచాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగ్గానే.. ఆమె అవును అని అనేసింది. అయితే ట్రాక్‌పై జరిగిన ఆ ఎంగేజ్మెంట్ ఎపిసోడ్‌ను లైవ్ కెమెరాలు షూట్ చేశాయి. ఫినిష్ లైన్ ప్రపోజల్‌పై పారాలింపిక్స్ ట్విట్టర్లో ఓ జిఫ్ పోస్టు చేశారు. జీవితాంతం ఇద్దరూ కలిసి పరుగెత్తుతారని ఆశిస్తున్నట్లు ఆ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆ జంటకు అనేక మంది కంగ్రాట్స్ కూడా తెలిపారు. ఆ వీడియో వైరల్ అవుతోంది.