బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Mar 01, 2020 , 17:02:58

గ్రూప్‌-బి నుంచి సెమీస్‌ బెర్త్‌లు ఖరారు..

గ్రూప్‌-బి నుంచి సెమీస్‌ బెర్త్‌లు ఖరారు..

హైదరాబాద్‌: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల టీ-20 వరల్డ్‌కప్‌లో గ్రూప్‌-బి నుంచి ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్‌ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. గ్రూప్‌-ఎ నుంచి వరుస విజయాలతో గ్రూప్‌ టాపర్‌గా నిలిచిన ఇండియా.. ముందుగానే సెమీస్‌ చేరిన విషయం తెలిసిందే. సెమీస్‌లో ఇగ్లాండ్‌ లేదా దక్షిణాఫ్రికా జట్టుతో ఇండియా తలపడనున్నది. గ్రూప్‌-బిలో రెండో స్థానంలో నిలిచే జట్టుతో భారత్‌ సెమీస్‌ ఆడనుంది. గ్రూప్‌-బిలో దక్షిణాఫ్రికా జట్టు.. విండీస్‌ జట్టుతో తలపడనున్నది. ఈ మ్యాచ్‌ ఫలితంతో భారత సెమీస్‌ ప్రత్యర్థి ఎవరనేది తేలనున్నది. రేపు ఆసీస్‌, కివీస్‌ మ్యాచ్‌తో విజేతగా నిలిచిన జట్టు గ్రూప్‌-ఎలో రెండో బెర్త్‌ ఖాయం చేసుకుంటుంది.


logo