గురువారం 21 జనవరి 2021
Sports - Dec 03, 2020 , 01:01:46

రైతుల ఉద్యమంలో గ్రేట్‌ ఖలీ

 రైతుల ఉద్యమంలో గ్రేట్‌ ఖలీ

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలంటూ దేశ రాజధాని ఢిల్లీలో అలుపెరుగని పోరాటం చేస్తున్న పంజాబ్‌, హర్యానా రైతులకు డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ రెజ్లర్‌ దిలీప్‌ సింగ్‌ రాణా (ది గ్రేట్‌ ఖలీ) మద్దతు తెలిపాడు. గురుగ్రామ్‌లోని టిక్రీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన నిరసనలో బుధవారం అతడు పాల్గొన్నాడు. అన్నదాతలకు దేశం మొత్తం అండగా నిలువాలని ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో ద్వారా గ్రేట్‌ ఖలీ ప్రజలకు పిలుపునిచ్చాడు. కొత్త వ్యవసాయ బిల్లుల వల్ల రైతులతో పాటు దినసరి కూలీలు, చిన్న వ్యాపారులు, సామాన్యులు తీవ్రంగా నష్టపోతారని అభిప్రాయపడ్డాడు. ప్రజలంతా మద్దతుగా ఉంటే కర్షకుల డిమాండ్లను కేంద్రం నెరవేరుస్తుందని ఖలీ చెప్పాడు. 


logo