గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Sep 13, 2020 , 18:50:19

స్టాయినీస్‌ గ్రేట్‌ ఫీల్డింగ్‌.. రాయ్‌ రనౌట్‌: వీడియో

స్టాయినీస్‌ గ్రేట్‌ ఫీల్డింగ్‌.. రాయ్‌ రనౌట్‌: వీడియో

మాంచెస్టర్‌:  ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా దూకుడుగా ఆడుతోంది. వన్డే సిరీస్‌లో శుభారంభం చేసి ఉత్సాహంగా  ఉన్న కంగారూలు రెండో వన్డేలోనూ అదరగొడుతున్నారు.  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు ఆరంభంలోనే ఆసీస్‌ బౌలర్లు షాకిచ్చారు.  స్టార్క్‌ వేసిన  ఐదో ఓవర్‌ తొలి బంతికే ఓపెనర్‌ బెయిర్‌స్టో డకౌటయ్యాడు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే  మరో విధ్వంసక ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ కూడా స్టార్క్ బౌలింగ్‌లో  రనౌట్‌గా వెనుదిరిగాడు.  మార్కస్‌ స్టాయినీస్‌ మెరుపు ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు.

మొదటి  ఐదు బంతులకు ఒక్క పరుగు సాధించని రూట్‌.. ఆఖరి బంతిని సింగిల్‌ తీసేందుకు  ప్రయత్నించాడు. కవర్‌- పాయింట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న స్టాయినీస్‌ వేగంగా బంతిని అందుకొని తనను తాను అదుపు చేసుకుంటూ గురిచూసి  కీపింగ్‌ వైపు ఉన్న  వికెట్లపైకి బంతిని విసిరాడు.  బంతి  వికెట్లకు డైరెక్ట్ హిట్ కావడంతో రాయ్‌ నిరాశగా మైదానాన్ని వీడాడు.  14 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్‌ 2 వికెట్లు కోల్పోయి 42 పరుగులు చేసింది. ప్రస్తుతం మోర్గాన్‌(2), జో రూట్‌(13) క్రీజులో ఉన్నారు. logo