శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Aug 20, 2020 , 01:01:02

చంపుతామని బెదిరించారు: స్మిత్‌

చంపుతామని బెదిరించారు: స్మిత్‌

 న్యూఢిల్లీ: వర్ణ వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌' ఉద్యమానికి మద్దతు ఇచ్చినందుకు తనతో పాటు మరికొందరు తీవ్ర బెదిరింపులకు గురయ్యారని దక్షిణాఫ్రికా మాజీ సారథి, ఆ దేశ క్రికెట్‌ ప్రస్తుత డైరెక్టర్‌ గ్రేమ్‌ స్మిత్‌ వెల్లడించాడు. హత్య చేస్తామంటూ కొందరు అభ్యంతరకర పదజాలంతో సోషల్‌ మీడియాలో కామెంట్లు చేశారని బుధవారం ఓ ఇంటర్వ్యూలో అతడు చెప్పాడు. అమెరికాలో జార్జ్‌ ఫ్లాయిడ్‌ అనే వ్యక్తి పోలీసు చేతిలో చనిపోవడంతో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌ ఉద్యమం ఉధృతమైంది. దీనికి దక్షిణాఫ్రికా పేసర్‌ లుంగీ ఎంగ్డీ మద్దతు తెలుపగా.. అతడిని స్మిత్‌ సమర్థించాడు.  ‘మమ్మల్ని చాలా మంది ద్వేషించారు. తిట్లతో పాటు హత్య బెదిరింపులకు గురయ్యాం. ఇంతటి విద్వేషం ఉందని తెలిసి షాక్‌కు గురయ్యా’ అని గ్రేమ్‌ స్మిత్‌ అన్నాడు. 


logo