శనివారం 04 జూలై 2020
Sports - Apr 17, 2020 , 16:27:20

స్మిత్​కు పూర్తిస్థాయి బాధ్యతలు

స్మిత్​కు పూర్తిస్థాయి బాధ్యతలు

జొహనెస్​బర్గ్​: క్రికెట్​ దక్షిణాఫ్రికా(సీఎస్​ఏ) పూర్తిస్థాయి డైరెక్టర్​గా గ్రేమ్​ స్మిత్​ నియమితుడయ్యాడు. గతేడాది డిసెంబర్​ నుంచి తాత్కాలిక డైరెక్టర్​గా ఉన్న స్మిత్​ను 2022 వరకు ఆ పదవిలో కొనసాగించనున్నట్టు సీఎస్​ఏ శుక్రవారం ప్రకటించింది. తాత్కాలిక పదవీ కాలంలో స్మిత్ అద్భుతంగా పనిచేశాడని, మెరుగైన ప్రణాళికలతో ముందుండి నడిపించాడని సీఎస్​ఏ తాత్కాలిక సీఈవో జాక్వెస్​ ఫౌల్ చెప్పాడు. అలాగే తాత్కాలిక జాతీయ సెలెక్టర్​గా లిండా జోండి సహా అనేక వ్యూహాత్మక నియామకాలు చేపట్టాడని, అందుకే స్మిత్​కు పూర్తిస్థాయి క్రికెట్ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించినట్టు చెప్పాడు. 


logo