గురువారం 21 జనవరి 2021
Sports - Jan 01, 2021 , 02:24:19

టెన్నిస్‌ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం

టెన్నిస్‌ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం

  • మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: రాష్ట్రంలో టెన్నిస్‌ అభివృద్ధికి ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందని క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభ కల్గిన క్రీడాకారులకు అత్యుత్తమ స్థాయి శిక్షణనిచ్చేందుకు కావాల్సిన అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. అసోసియేషన్‌ తరఫున టెన్నిస్‌ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని అందుకు ఎల్బీ స్టేడియంలోని టెన్నిస్‌ కాంప్లెక్స్‌ను ఉపయోగించుకునేందుకు సాట్స్‌ నుంచి అనుమతి కావాలని సంఘం ప్రతినిధులు కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో నూతన క్రీడా పాలసీ కోసం సీఎం కేసీఆర్‌ క్యాబినెట్‌ సబ్‌ కమిటీని నియమించారని మంత్రి అన్నారు. పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకు త్వరలో సబ్‌ కమిటీ సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, టెన్నిస్‌ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. 


logo