ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Sports - Aug 04, 2020 , 16:03:49

ధోనీ తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు: రైనా

ధోనీ తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు: రైనా

న్యూఢిల్లీ: లాక్​డౌన్ వల్ల నాలుగు నెలలకు పైగా ఇంటికే పరిమితమైనా.. త్వరలోనే ఐపీఎల్ జరుగనుండడం ఉత్సాహాన్ని కలిగిస్తున్నదని చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్​మన్ సురేశ్ రైనా చెప్పాడు. ఐపీఎల్ కోసం ఘజియాబాద్​లో రైనా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతడితో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు రిషభ్ పంత్ సైతం అక్కడే కసరత్తులు చేస్తున్నాడు. అలాగే సూపర్​కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్​ ధోనీ.. రాంచీలోని ఇంట్లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడని క్రికెట్​ కనెక్టెడ్ అనే టీవీషోలో రైనా వెల్లడించాడు

. “త్వరలో మాకు(చెన్నై సూపర్ కింగ్స్​) శిక్షణ శిబిరం ఉంటుంది. నాలుగు నెలలకు పైగా లాక్​డౌన్ తర్వాత ఐపీఎల్​ను త్వరగా నిర్వహిస్తుండడం మంచి విషయం. ఎంతో ఉత్సాహంగా ఉంది. నేను, రిషభ్ పంత్​ కలిసి ఘజియాబాద్​లో ప్రాక్టీస్ చేస్తున్నాం. అతడు బంతిని చాలా బాగా బాదుతున్నాడు. చావ్లా కూడా వచ్చాడు. బాగా ప్రాక్టీస్ చేశాడు. అలాగే చాలా మంది ప్లేయర్లతో నేను మాట్లాడుతున్నా. అంతా ప్రణాళిక ప్రకారమే సాగుతున్నది. ఎంఎస్ ధోనీ తన ఇంట్లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అందరూ అలాగే కష్టపడాలి. క్రికెట్​లో ఉండాలంటే మంచి ఫిట్​నెస్​తో పాటు అంకితభావం ఉండాలి” అని సురేశ్ రైనా అన్నాడు. కాగా సెప్టెంబర్​ 19నుంచి నవంబర్​ 10వ తేదీ వరకు యూఏఈ వేదికగా ఈ ఏడాది ఐపీఎల్​ 13వ సీజన్ జరుగనున్న సంగతి తెలిసిందే.


logo