మంగళవారం 02 మార్చి 2021
Sports - Jan 22, 2021 , 10:36:37

వ‌ర‌ల్డ్ రికార్డ్‌.. ఇలాంటి గోల్ ఎప్పుడైనా చూశారా.. వీడియో

వ‌ర‌ల్డ్ రికార్డ్‌.. ఇలాంటి గోల్ ఎప్పుడైనా చూశారా.. వీడియో

ఫుట్‌బాల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక దూరం నుంచి గోల్ కొట్టాడు న్యూపోర్ట్ కౌంటీకి చెందిన గోల్‌కీప‌ర్ టామ్ కింగ్‌. చెల్టెన్‌హామ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కింగ్ త‌న గోల్ పోస్ట్ నుంచి ప్ర‌త్య‌ర్థి గోల్‌పోస్ట్‌లోకి బాల్‌ని కిక్ చేయ‌డం విశేషం. ఈ మొత్తం దూరం 96.01 మీట‌ర్లు (315 అడుగులు). ఈ గోల్‌తో 2013లో అస్మిర్ బెగోవిక్ కొట్టిన 91.9 మీట‌ర్ల రికార్డు గోల్ మ‌రుగున ప‌డిపోయింది. ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌రల్డ్ రికార్డ్స్ వెబ్‌సైట్ ధృవీక‌రించింది. ఆ స‌మ‌యంలో గాలి వీచే దిశ కూడా అనుకూలంగా ఉండ‌టంతో ప్ర‌త్య‌ర్థి గోల్‌కీప‌ర్‌ను బోల్తా కొట్టించి మ‌రీ కింగ్ ఈ గోల్ చేయ‌గ‌లిగాడు. ఈ గోల్ గురించి చాలా కాలంపాటు చ‌ర్చించుకుంటార‌ని, త‌న‌కు చాలా గ‌ర్వంగా ఉన్న‌ద‌ని మ్యాచ్ త‌ర్వాత కింగ్ అన్నాడు. 

VIDEOS

logo