శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Mar 02, 2020 , 00:14:12

హంపి@2

హంపి@2

చెన్నై: ఇటీవల అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న భారత గ్రాండ్‌మాస్టర్‌, తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపి ప్రపంచ చెస్‌ ర్యాంకింగ్‌లో రెండో స్థానానికి చేరింది. గతేడాది డిసెంబర్‌లో ప్రపంచ ర్యాపిడ్‌ చాంపియన్‌గా అవతరించిన హంపి.. ఇటీవల ప్రతిష్ఠాత్మక కెయిన్స్‌ కప్‌ను కైవసం చేసుకొని సత్తాచాటింది. దీంతో హంపి 2589 ఎలో రేటింగ్‌ పాయింట్లు సాధించి ఆదివారం వెల్లడైన తాజా ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న ప్రపంచ చాంపియన్‌ జు వెంజున్‌ (2583)ను వెనక్కినెట్టింది. చైనా ప్లేయర్‌ ఇఫాన్‌ హొయు (2658) అగ్రస్థానంలో ఉంది. మరో తెలుగు ప్లేయర్‌ ద్రోణవల్లి హారిక (2517) తొమ్మిదో ర్యాంకులో నిలిచిం ది. కాగా, పురుషుల విభాగం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్లు ఎవరూ టాప్‌-10లో చోటు దక్కించుకోలేకపోయారు. ప్రపంచ మాజీ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ 16వ స్థానంలో కొనసాగగా.. నాలుగు స్థానాలు మెరుగుపరుచుకున్న విదిత్‌ సంతోశ్‌ 22వ ర్యాంకులో ఉన్నాడు.


logo