శుక్రవారం 22 జనవరి 2021
Sports - Nov 29, 2020 , 11:25:49

ఫిలిప్స్ రికార్డ్ సెంచరీ.. రెండో టీ20 కూడా కివీస్‌దే

ఫిలిప్స్ రికార్డ్ సెంచరీ.. రెండో టీ20 కూడా కివీస్‌దే

మౌంట్‌మాంగ‌నూయి: న‌్యూజిలాండ్ బ్యాట్స్‌మ‌న్ గ్లెన్ ఫిలిప్స్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయాడు. వెస్టిండీస్‌తో జ‌రిగిన రెండో టీ20లో కేవ‌లం 46 బంతుల్లో సెంచ‌రీ చేశాడు. న్యూజిలాండ్ త‌ర‌ఫున టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ప్లేయ‌ర్‌గా రికార్డు సృష్టించాడు. దీంతో రెండో టీ20లో విండీస్‌ను 72 ప‌రుగుల‌తో చిత్తు చేసి 2-0 లీడ్ సాధించింది కివీస్ టీమ్‌. ఫిలిప్స్ రికార్డు సెంచ‌రీ చేయ‌డ‌మే కాదు.. మూడో వికెట్‌కు డెవోన్ కాన్వే (65 నాటౌట్‌)తో క‌లిసి మూడో వికెట్‌కు రికార్డు 183 ప‌రుగులు భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు. దీంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల‌కు 238 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. ఆ త‌ర్వాత చేజింగ్‌లో విండీస్ బ్యాట్స్‌మెన్ త‌డ‌బ‌డ్డారు. హార్డ్ హిట్ట‌ర్ల‌తో కూడిన విండీస్ లైన‌ప్‌లో ఏ ఒక్క బ్యాట్స్‌మ‌న్ కూడా నిల‌దొక్కులేక‌పోయాడు. చివ‌రికి 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల‌కు 166 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. కెప్టెన్ పొలార్డ్ 28 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఈ విజ‌యంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే 2-0తో గెలుచుకుంది న్యూజిలాండ్‌. 


logo