సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Feb 13, 2020 , 00:27:04

మ్యాక్స్‌వెల్‌కు గాయం

 మ్యాక్స్‌వెల్‌కు గాయం

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌కు గాయమైంది. దీంతో ఈనెల 21 నుంచి మొదలయ్యే దక్షిణాఫ్రికా పర్యటనకు మ్యాక్స్‌వెల్‌ దూరమయ్యాడు. మోచేతి గాయంతో బాధపడుతున్న ఈ ఆసీస్‌ క్రికెటర్‌ పూర్తిస్థాయిలో కోలుకునేందుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాలు పట్టే అవకాశముందని క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ కారణంగా దక్షిణాఫ్రికా సిరీస్‌కు తోడు మార్చి 29 నుంచి మొదలవుతున్న ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు మ్యాక్స్‌ దూరమయ్యే చాన్స్‌ కనిపిస్తున్నది. ఇటీవల జరిగిన వేలంపాటలో కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ జట్టు మ్యాక్స్‌వెల్‌ను తిరిగి తీసుకుంది. తన గాయంపై స్పందిస్తూ ‘దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తప్పుకోవడం ఒకింత కష్టంగానే అనిపించింది. గాయం కారణంగా ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో రాణించలేని స్థితిలో ఉన్నాను. పూర్తిగా కోలుకునేందుకు శస్త్రచికిత్స చేయించుకోనున్నాను’ అని మ్యాక్స్‌వెల్‌ అన్నాడు. 


logo