బుధవారం 03 మార్చి 2021
Sports - Feb 18, 2021 , 15:33:48

మ్యాక్స్‌వెల్‌కు రూ.14.25 కోట్లు.. కొనుగోలు చేసిన ఆర్సీబీ

మ్యాక్స్‌వెల్‌కు రూ.14.25 కోట్లు.. కొనుగోలు చేసిన ఆర్సీబీ

చెన్నై: ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు ఐపీఎల్‌లో ఏమాత్రం డిమాండ్ త‌గ్గ‌లేదు. గ‌త సీజ‌న్‌లో అత‌నికి ప‌ది కోట్లు ఇచ్చినా పంజాబ్ త‌ర‌ఫున దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు. టోర్నీ మొత్తంలో క‌నీసం ఒక్క సిక్స్ కూడా బాద‌లేదు. దీంతో ఆ టీమ్ అత‌న్ని వ‌దిలేసింది. కానీ ఈసారి రూ.2 కోట్ల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి వ‌చ్చిన మ్యాక్స్‌వెల్ కోసం ఫ్రాంచైజీలు పోటీ ప‌డ్డాయి. అత‌ని కోసం బెంగ‌ళూరు, చెన్నై ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ ప‌డ్డాయి. చివ‌రికి బెంగ‌ళూరే అత‌న్ని రూ.14.25 కోట్ల‌కు కొనుగోలు చేసింది. 

మ‌రోవైపు బంగ్లాదేశ్ ఆల్‌రౌండ‌ర్ ష‌కీబుల్ హ‌స‌న్‌ను రూ.3.2 కోట్లు పెట్టి కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో అత‌ను వేలంలోకి వ‌చ్చాడు. అత‌ని కోసం కింగ్స్ పంజాబ్ కూడా తీవ్రంగానే ప్ర‌య‌త్నించింది. చివ‌రికి కోల్‌క‌తా అత‌న్ని ద‌క్కించుకుంది.

మోయిన్ అలీకి రూ.7 కోట్లు

ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ మోయిన్ అలీ కోసం కూడా చెన్నై, పంజాబ్ మ‌ధ్య పోటీ బాగానే న‌డిచింది. రూ.2 కోట్ల బేస్‌ప్రైస్‌తో అత‌ను వేలంలోకి రాగా.. ఈ రెండు ఫ్రాంచైజీలు బిడ్‌ను పెంచుతూ వెళ్లాయి. చివ‌రికి రూ.7 కోట్లు పెట్టి చెన్నై అత‌న్ని కోనుగోలు చేసింది.

శివ‌మ్ దూబెకు రూ.4.4 కోట్లు

టీమిండియా ఆల్‌రౌండ‌ర్ శివ‌మ్ దూబె ఈసారి వేలంలోనూ భారీగానే ధ‌ర ప‌లికాడు. రూ.50 ల‌క్ష‌ల బేస్‌ప్రైస్‌తో ఎంట్రీ ఇచ్చిన అత‌న్ని ఏకంగా రూ.4.4 కోట్ల‌కు రాజ‌స్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. మ‌ధ్య‌లో హైద‌రాబాద్ టీమ్ కూడా బిడ్‌వేసినా.. త‌ర్వాత త‌ప్పుకుంది.


VIDEOS

logo