Glenn Maxwell : ఐపీఎల్ మినీ వేలానికి ముందే స్టార్ క్రికెటర్లు ఒక్కొక్కరుగా వైదొలుగుతున్నారు. పవర్ హిట్టరైన ఆండ్రూ రస్సెల్ ఏకంగా వీడ్కోలు పలకగా.. క్లాసిక్ బ్యాటర్ ఫాఫ్ డూప్లెసిస్ త్వరలో మళ్లీ వస్తానంటూ ఆక్షన్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) సైతం ఈ మెగా లీగ్‌కు టాటా చెప్పేశాడు. తాను ఐపీఎల్ వేలంలో పాల్గొనడం లేదని మంగళవారం మ్యాక్సీ ప్రకటించాడు. దాంతో.. ఈ విధ్వంసక ప్లేయర్ సైతం ఐపీఎల్‌కు వీడ్కోలు పలికేశాడా? అని చర్చించుకుంటున్నారు అభిమానులు.
అబుధాబీలో డిసెంబర్ 16న ఐపీఎల్ మినీ వేలం కోసం ఫ్రాంచైజీలు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే కొనాల్సిన ఆటగాళ్లతో పెద్ద జాబితా తయారుచేసుకున్న పది జట్లు.. ఎవరిపై ఎంత ఖర్చు చేయాలి? అనే కసరత్తు కూడా చేసేశాయి. వేలానికి మరో రెండు వారాలే ఉండగా.. స్టార్ ప్లేయర్లు మాత్రం అయిష్టత చూపుతున్నారు. ఇప్పటికే రస్సెల్, డూప్లెసిస్ వైదొలగగా.. ఆసీస్ చిచ్చరపిడుగు గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా నేను వేలంలోకి రావడం లేదు అని అభిమానులకు పెద్ద షాకిచ్చాడు. అంతేకాదు ఐపీఎల్లో నేను చివరి మ్యాచ్ ఆడేశానని వీడ్కోలు వార్తను చెప్పకనే చెప్పేశాడీ ఆల్‌రౌండర్.
“The memories, the challenges, and the energy of India will stay with me forever”
Glenn Maxwell has decided to opt out of the upcoming IPL auction pic.twitter.com/lx2x1uSTn0
— ESPNcricinfo (@ESPNcricinfo) December 2, 2025
‘ఐపీఎల్లో ఎన్నో మరపురాని సీజన్లు ఆడాను. ఇక వేలంలో నా పేరు నమోదు చేసుకోవద్దని నిర్ణయించుకున్నా. ఇది నిజంగా పెద్ద నిర్ణయమే. ఇన్నేళ్లు నాకు ఈ లీగ్‌లో నాకు లభించిన ఆదరణకు కృతజ్ఞుతలు తెలియజేస్తున్నా. ఐపీఎల్ నన్ను ఆటగాడిగా, వ్యక్తిగా ఎంతో మార్చింది. ప్రపంచస్థాయి ఆటగాళ్లతో కలిసి పలు జట్లకు ఆడే అవకాశం దక్కినందుకు అదృష్టవంతుడిని. వందలాది మంది ప్రేక్షకుల సమక్షంలో ఆడడం మర్చిపోలేని అనుభూతి. ఇక్కడ నాకు ఎదురైన సవాళ్లు, మిగిలిన జ్ఞాపకాలు.. నాకు లభించిన శక్తి నాతో ఎల్లప్పుడూ ఉంటాయి. ఇన్నిరోజలు నాకు మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు’ అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు మ్యాక్సీ. మినీ వేలం నుంచి ఆసీస్ స్టార్ వైదొలగడంతో పాటు చివరి మ్యాచ్ ఆడేశానని చెప్పడంతో వీడ్కోలు వార్త చెప్పేశాడని అంటున్నారు విశ్లేషకులు.
🚨 GLENN MAXWELL ON MISSING IPL 2026. 🚨 pic.twitter.com/bBNLbWBZbj
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 2, 2025
టీ20ల్లో వన్ మ్యాన్ షోతో అలరించిన మ్యాక్స్‌వెల్ ఐపీఎల్లో మాత్రం పెద్దగా మెప్పించలేదు. పదిహేడో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ తరఫున దారుణంగా విఫలమైన మ్యాక్సీ.. పద్దెనిమిదో సీజన్లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తరఫున దారుణంగా ఆడాడు. వేలంలో రూ.4.2 కోట్లకు ఆసీస్ స్టార్‌ను కొన్న పంజాబ్ పంతొమ్మిదో సీజన్‌కు అతడిని అట్టిపెట్టుకోలేదు. ఈ మెగా టోర్నీలో మ్యాక్సీ 2012లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఆటగాడిగా కెరీర్ మొదలెట్టాడు.
Glenn Maxwell has not registered for the mini auction in IPL 2026🚨
baba “Andre Russell” “Glenn Maxwell” #ProudMomentForIndia #australiacricket
— Anita Meena (@Rahulm_01) December 2, 2025
2013లో ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడైన మ్యాక్స్‌వెల్.. ఆ తర్వాత పంజాబ్, ఆర్సీబీకి అనంతరం పంజాబ్‌కు ఆడాడు. 2021 నుంచి మూడు సీజన్లు బెంగళూరుకు ఆడిన ఈ స్టార్ ప్లేయర్ 513, 301, 400 రన్స్‌తో మెరిశాడు. ఐపీఎల్లో 141 మ్యాచుల్లో ఈ చిచ్చరపిడుగు 2,819 పరుగులు సాధించాడు.