గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 26, 2020 , 18:35:28

భారత సంతతి అమ్మాయితో మాక్స్‌వెల్‌ పెళ్లి

భారత సంతతి అమ్మాయితో మాక్స్‌వెల్‌ పెళ్లి

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మెల్‌బోర్న్‌కు చెందిన భారత సంతతి అమ్మాయి వినీ రామన్‌(ఫార్మాసిస్ట్‌)ను పెళ్లి చేసుకోబోతున్నాడు.  తనకు ఎంగేజ్‌మెంట్‌ జరిగిన విషయాన్ని మాక్స్‌వెల్‌ సోషల్‌ మీడియాలో తెలిపాడు. ఈ సందర్భంగా కాబోయే భార్యతో దిగిన ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్నాడు. తన  గర్ల్‌ఫ్రెండ్‌ వినీ ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ చూపిస్తూ ఫొటోకు పోజునివ్వడం విశేషం.  వీరిద్దరూ గత కొన్నాళ్లుగా  ప్రేమలో ఉన్నారని ఆసీస్‌ క్రికెటర్లు చెబుతున్నారు. 

విదేశీ పర్యటనలు, డిన్నర్‌లకు   చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఈ జంట ఇప్పుడు ఒకటి కావాలని నిర్ణయించుకుంది. రెండేళ్లుగా వీరిద్దరూ డేటింగ్‌లో కూడా ఉన్నారు. ఈ జోడీ ఫొటో తొలిసారి 2017లో మీడియా దృష్టిలో పడింది. 2019 ఆస్ట్రేలియా క్రికెట్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో తన భాగస్వామి రామన్‌తో కలిసి మాక్స్‌వెల్‌ రావడంతో పెళ్లి గురించి చర్చ మొదలైంది. తాజాగా మాక్సీ-వినీ ఎంగేజ్‌మెంట్‌ చేసుకోవడంతో ఆసీస్‌ క్రికెటర్లు కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతున్నారు. logo
>>>>>>