శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Sep 17, 2020 , 11:06:32

మ్యాక్స్‌వెల్ స్ట‌న్నింగ్ సెంచ‌రీ.. ఆసీస్‌కే వ‌న్డే సిరీస్‌

మ్యాక్స్‌వెల్ స్ట‌న్నింగ్ సెంచ‌రీ.. ఆసీస్‌కే వ‌న్డే సిరీస్‌

హైద‌రాబాద్‌: ఇంగ్లండ్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవ‌సం చేసుకున్న‌ది. ఓల్డ్ ట్రాఫ‌ర్డ్‌లో జ‌రిగిన‌ మూడ‌వ వ‌న్డేలో ఆస్ట్రేలియా థ్రిల్లింగ్ విక్ట‌రీ న‌మోదు చేసింది.  గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, అలెక్స్ కేరీల అద్భుత సెంచ‌రీల‌తో ఆస్ట్రేలియా చివ‌రి ఓవ‌ర్‌లో విజ‌యం సాధించింది.  ఈ ఇద్ద‌రూ 212 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. 303 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియా ఓ ద‌శ‌లో 73 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయింది. అయితే మ్యాక్స్‌వెల్ 108, క్యారీ 106 ప‌రుగుల‌తో ఆసీస్‌ను విజ‌య‌తీరానికి చేర్చారు. చివ‌రి ఓవ‌ర్‌లో ప‌ది ప‌రుగులు అవ‌స‌రం కాగా, మ‌రో రెండు బంతులు మిగిలి ఉండ‌గానే ల‌క్ష్యాన్ని అందుకున్నారు.  అయిదేళ్లుగా స్వ‌దేశం వ‌న్డే సిరీస్‌ను కోల్పోని ఇంగ్లండ్ ఈ ఓట‌మితో చేదు అనుభ‌వం ఎదురైంది.  అంత‌కుముందు ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జానీ బెయిర్‌స్టో 112 ప‌రుగులు చేశాడు. ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లకు 302 ర‌న్స్ చేసింది. వ‌న్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో సొంతం చేసుకున్న‌ది. 

స్కోరు బోర్డు

ఇంగ్లండ్   302-7 (50 ఓవ‌ర్లు):  బెయిర్‌స్టో 112, బిల్లింగ్స్‌ 57, జంపా 3-51

ఆస్ట్రేలియా 305-7 (49.4 ఓవ‌ర్లు): మ‌్యాక్స్‌వెల్‌ 108, క్యారీ 106, వోక్స్‌ 2-46


 


logo