ఆదివారం 05 జూలై 2020
Sports - May 01, 2020 , 23:37:32

వేలానికి గిబ్స్ బ్యాట్‌

వేలానికి గిబ్స్ బ్యాట్‌

జొహ‌న్నెస్‌బ‌ర్గ్‌: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారిపై పోరాడేందుకు క్రీడాలోకం విరాళాల ప‌రంప‌ర కొన‌సాగుతున్న‌ది. కొంద‌రు ఆట‌గాళ్లు సొంతంగా ఆర్థిక సాయం అందిస్తుండ‌గా.. మ‌రికొంద‌రు ప్లేయ‌ర్లు త‌మ‌కు ఇష్ట‌మైన వ‌స్తువుల‌ను వేలం వేయ‌డం ద్వారా వ‌చ్చిన మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నారు. ఇప్ప‌టికే వంద‌లాది మంది ప్లేయ‌ర్లు ఈ కార్య‌క్ర‌మంలో భాగంకాగా.. ఇప్పుడు తాజాగా ద‌క్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మ‌న్ హ‌ర్ష‌ల్ గిబ్స్ కూడా ఈ జాబితాలో చేరాడు. 

ఆస్ట్రేలియాపై చారిత్ర‌క 434 ప‌రుగుల ల‌క్ష్య‌ఛేద‌న‌లో 175 ప‌రుగులు చేసిన గిబ్స్‌.. ఆ మ్యాచ్‌లో వినియోగించిన బ్యాట్‌ను తాజాగా వేలానికి పెట్టాడు. దీని ద్వారా వ‌చ్చిన మొత్తాన్ని క‌రోనా వైర‌స్‌పై పోరాటానికి వినియోగించ‌నున్న‌ట్లు పేర్కొన్నాడు. 


logo