ఆదివారం 07 జూన్ 2020
Sports - Apr 06, 2020 , 20:24:28

ప‌టాకులు ఇప్పుడెందుకు కాల్చ‌డం: గ‌ంభీర్, భ‌జ్జీ

ప‌టాకులు ఇప్పుడెందుకు కాల్చ‌డం: గ‌ంభీర్, భ‌జ్జీ

ప‌టాకులు ఇప్పుడెందుకు కాల్చ‌డం: గ‌ంభీర్, భ‌జ్జీ

న్యూఢిల్లీ: ఓవైపు దేశం మొత్తం ప్ర‌మాద‌క‌ర క‌రోనా వైర‌స్‌తో పారాడుతుంటే కొంద‌రు చేస్తున్న ప‌నులు కోపం తెప్పిస్తున్నాయి. క్లిష్ట ప‌రిస్థితుల్లో ప్రాణాల‌ను ప‌ణంగా పెడుతూ పోరాడుతున్న వైద్యులకు సంఘీభావంగా దీపాలు వెలిగించ‌మ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సందేశ‌మిచ్చిన సంగ‌తి తెలిసిందే. అందుకు త‌గ్గ‌ట్లు ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు త‌ర‌త‌మ బేధం లేకుండా కొవోత్తులు, క్యాండిల్స్‌, కాగ‌డాల‌తో త‌మ సంఘీభావం తెలిపారు. ఇంతవ‌ర‌కు బాగానే ఉంది. కానీ కొంద‌రు చేసిన ప‌ని విమర్శ‌ల‌కు దారితీసింది. అవును సంద‌ర్భంతో సంబంధం లేకుండా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప‌టాకులు కాల్చారు. దీన్ని భార‌త క్రికెటర్లు గౌతం గంభీర్‌, హ‌ర్భ‌జ‌న్ సింగ్ తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా వారి తీరును ఎండ‌గ‌ట్టారు. ‘ ఇండియా అంతా ఇంట్లోనే ఉండండి. ఇంకా మ‌నం యుద్దం మ‌ధ్య‌లోనే ఉన్నాం. ప‌టాకులు కాల్చేందుకు ఇది స‌రైన స‌మ‌యం కాదు’ అని గౌతీ ట్వీట్ చేశాడు. మ‌రోవైపు భ‌జ్జీ స్పందిస్తూ  ‘ క‌రోనా వైర‌స్‌కు మ‌నం త్వ‌ర‌లోనే మందు క‌నుక్కొంటాం కావ‌చ్చు, కానీ ఈ పిచ్చిత‌నాన్ని పార‌దోలేందుకు ఏం చేయాలో చూడాలి’ అని ట్వీట్ రాశాడు. వీరిద్ద‌రిని మాజీ క్రికెట‌ర్ ఇర్పాన్ ప‌ఠాన్ కూడా అనుస‌రించాడు. ఇక గంభీర్ మ‌రోమారు త‌న ఉదార‌త‌ను చాటుకున్నాడు. ఇప్ప‌టికే త‌న ఎంపీ నిధుల‌ను ఇచ్చేందుకు సిద్ధ‌మైన ..ఈ మాజీ క్రికెట‌ర్ వైద్య ప‌రిక‌రాలు, కొవిడ్‌-19 పేషెంట్ల చికిత్స కోసం ఢిల్లీ రాష్ట్ర ప్ర‌భుత్వానికి రూ.50 ల‌క్ష‌ల విరాళ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. 
 
 


logo