సోమవారం 08 మార్చి 2021
Sports - Feb 23, 2021 , 21:46:34

బికినీలపై బ్యాన్‌..టోర్నీ నుంచి తప్పుకున్న క్రీడాకారిణీలు!

బికినీలపై బ్యాన్‌..టోర్నీ నుంచి తప్పుకున్న క్రీడాకారిణీలు!

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ పలు దేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో బికినీలు, మినీ స్కర్టులపై నిషేధం ఉంది.  మహిళల దుస్తులు, ఫ్యాషన్‌పై ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఖతార్‌లో కఠిన దుస్తులు నిబంధనల కారణంగా అథ్లెట్లు కూడా బికినీ ధరించడానికి వీల్లేదు. దీంతో త్వరలో ఆ దేశంలో జరగబోయే   FIVB వరల్డ్ టూర్ నుంచి తప్పుకోవాలని జర్మనీకి చెందిన ఇద్దరు క్రీడాకారిణీలు యోచిస్తున్నారు.  ఖతార్‌లో జరిగే టోర్నమెంట్‌ను బహిష్కరిస్తామని బీచ్‌ వాలీబాల్‌ స్టార్స్ కార్లా బోర్గర్,  జూలియా సుడే చెప్పారు. క్రీడా కోర్టులో ఆటగాళ్ళు బికినీ ధరించడాన్ని నిషేధించిన ‘ఏకైక దేశం’ ఖతారే. 

మధ్యాహ్నం వేడిలో 30-40డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద గేమ్‌లు ఆడతాం. మేం బికినీ ధరించే మ్యాచ్‌ ఆడతాం. మేం ఎలా ఉండాలి. టోర్నీలో ఎలా ఆడాలో ప్రభుత్వమే నిర్ణయించడాన్ని మేం విమర్శిస్తున్నాం. అసలు అక్కడ టోర్నీ నిర్వహించడం అవసరమా అని మేం అడుగుతున్నాం. కచ్చితంగా దీన్ని ప్రశ్నించాల్సిందేనని బోర్డర్‌ మండిపడ్డారు.

VIDEOS

logo