శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Nov 02, 2020 , 01:30:58

‘జియో’ మహిళల ఐపీఎల్‌

 ‘జియో’ మహిళల ఐపీఎల్‌

దుబాయ్‌: మహిళల ఐపీఎల్‌ (టీ20 చాలెంజ్‌) టోర్నీకి ‘జియో’టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించనుందని బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. ఈ నెల 4 నుంచి 9 వరకు జరుగనున్న టోర్నీలో వెలాసిటీ, సూపర్‌నోవాస్‌, ట్రైల్‌బ్లేజర్స్‌ జట్లు పాల్గొననున్నాయి. ‘జియో మహిళల టీ20 చాలెంజ్‌.. యువతలో స్ఫూర్తి రగిలిస్తుందని భావిస్తున్నాం. ఇదే బాటలో మరింతమంది అమ్మాయిలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు ముందుకు వస్తారు’అని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఆశాభావం వ్యక్తంచేశాడు.