శనివారం 08 ఆగస్టు 2020
Sports - Jul 13, 2020 , 09:38:28

గవాస్కర్‌ నాకు షార్ట్‌ పిచ్‌ బంతులు ఎలా ఆడాలో చెప్పాడు : ఇంజమామ్‌

గవాస్కర్‌ నాకు షార్ట్‌ పిచ్‌ బంతులు ఎలా ఆడాలో చెప్పాడు : ఇంజమామ్‌

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ భారత లెజెండ్ సునీల్ గవాస్కర్‌ను ప్రశంసించాడు. ఇంజమామ్‌కు సరళమైన, చిన్న సలహాలు ఇవ్వడం ద్వారా షార్ట్ పిచ్ డెలివరీ సమస్యను ఎలా అధిగమించాలో సునీల్‌ గవాస్కర్‌ తనకు సాయపడిన విషయాన్ని వివరించాడు. 1992లో ఆస్ట్రేలియాలో ప్రపంచ కప్ తర్వాత తాను ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లానని, అక్కడ షార్ట్‌ పిచ్‌ డెలివరీలను నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఇంజమామ్‌ అన్నాడు. 

"నేను 1992 ప్రపంచ కప్ తరువాత మెగా ఈవెంట్లో అద్భత ప్రదర్శన చేసేందుకు ఆస్ట్రేలియా వెళ్లాను. అది నా మొదటి ఇంగ్లాండ్ పర్యటన. ఆ పిచ్‌లపై నేను ఎలా ఆడాలి అనే ఆలోచన నాకు ఉండేది కాదు. నేను షార్ట్ పిచ్ డెలివరీలను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడేవాడిని’’ అని ఇంజమామ్‌ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నారు. ఆ ఇంగ్లాండ్ పర్యటనలో తాను ఒక ఛారిటీ మ్యాచ్‌లో సునీల్ గవాస్కర్‌ను కలిశానని, షాట్‌ పిచ్‌ డెలవరీ విషయంలో ఆయన సాయం కోరినట్లు ఇంజమామ్‌ తెలిపాడు. 

"ఆ సీజన్‌లో ఇంగ్లాండ్‌లో జరిగిన ఒక ఛారిటీ మ్యాచ్‌లో నేను సునీల్‌ గవాస్కర్‌ను కలిశాను. మేమిద్దరం ఆ మ్యాచ్ ఆడటానికి వెళ్లాం. నేను అతడిని ‘సునీల్ భాయ్ షార్ట్ పిచ్ బంతులు ఆడటానికి సమస్యలను ఎదుర్కొంటున్నాను, నేను ఏమి చేయాలి’’ అని అడిగినట్లు తెలిపారు. ‘‘దీంతో సునీల్‌ నాకు ఒక చిన్న పని మాత్రమే చేయమని చెప్పాడు, 'బ్యాటింగ్ చేసేటప్పుడు షార్ట్ పిచ్‌ బంతులు, బౌన్సర్ల గురించి ఆలోచన చేయవద్దు. బౌలర్ బంతిని వేసినప్పుడు స్వయం చాలాకంగా అర్థం చేసుకోవాలని, షార్ట్‌ పిచ్‌ డెలవరీ గురించి చింతించకండి’’. అని సునీల్‌ తనకు చెప్పినట్లు ఇంజమామ్‌ పేర్కొన్నాడు. తాను గవాస్కర్ సలహాను ఉపయోగించానని, నెట్స్‌లో ప్రాక్టీస్ చేశానని చెప్పాడు. దీంతో ఇది వర్కౌట్‌ అయ్యిందని ఆతరువాత షార్ట్ బాల్‌కు వ్యతిరేకంగా తనకు ఎలాంటి సమస్యలు లేవని ఇంజమామ్‌ చెప్పుకొచ్చాడు. ‘‘ఆ షార్ట్ పిచ్ బంతుల గురించి ఆలోచించవద్దని చెప్పి నా మనసును బలపరచుకున్నాను. బలహీనత తొలగించబడింది. 1992 నుంచి నేను పదవీ విరమణ చేసిన సమయం వరకు, నేను మళ్లీ ఆ సమస్యను ఎదుర్కోలేదు” అని 50 ఏండ్ల ఇంజమామ్‌ అన్నారు. ఇతను 120 టెస్టుల్లో 8,830 పరుగులు, 378 వన్డేల్లో 11,739 పరుగులు సాధించాడు.

జులై 10న (శుక్రవారం) గవాస్కర్‌ 71వ జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి ఈ విషయాలను గుర్తు చేసుకున్నాడు ఇంజమామ్‌. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo