కోహ్లీకి అలా..నటరాజన్‌కు ఇలానా..

మేనేజ్మెంట్పై గవాస్కర్ ఆగ్రహం
న్యూఢిల్లీ: టీమ్ఇండియా మేనేజ్మెంట్ ద్వంద్వ విధానాలను అవలంభిస్తున్నదని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆరోపించాడు. తండ్రి కానున్న కెప్టెన్ విరాట్ కోహ్లీకి పితృత్వ సెలవులు ఇచ్చి, ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన అంశాన్ని బుధవారం ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు. అదే యువ బౌలర్ నటరాజన్ భార్య పాపకు జన్మనిచ్చినా నెట్ బౌలర్‌గా అతడు ఆస్ట్రేలియాలోనే ఉండాలని బీసీసీఐ చెప్పిందన్నారు. కోహ్లీకి ఓ న్యాయం.. నటరాజన్‌కు ఓ న్యాయమా అంటూ గవాస్కర్ ప్రశ్నించాడు. ఈ ఏడాది ఐపీఎల్ ప్లేఆఫ్స్ సమయంలో నటరాజన్ భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఐపీఎల్ పూర్తయ్యాక నటరాజన్ దుబాయ్ నుంచి భారత్ రాకుండా నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. జనవరిలో తండ్రి కానున్న కోహ్లీకి సెలవులు ఇచ్చినప్పుడు.. బిడ్డ జన్మించినా నెట్బౌలర్గానైనా జట్టుతోనే ఉండాలని నటరాజన్‌కు చెప్పడమేంటని బీసీసీఐని గవాస్కర్ ప్రశ్నించాడు. టెస్టు జట్టులో లేనప్పుడు నట్టూను ఇంకా అక్కడే ఉంచాల్సిన అవసరం ఏముందని అన్నాడు. అలాగే టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన తర్వాత కూడా అతడిని నెట్‌బౌలర్‌గానే పరిమితం చేయడంపై సన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గతంలో స్పిన్నర్ అశ్విన్ ఒక్క మ్యాచ్‌లో రాణించకపోయినా పక్కన పెట్టారని.. అదే బ్యాట్స్‌మెన్ విషయంలో అలా చేశారా అని సన్నీ ప్రశ్నించాడు.
తాజావార్తలు
- విజయ్ దేవరకొండపై భారీ బడ్జెట్ వర్కవుట్ అయ్యేనా..?
- 'వకీల్‌సాబ్' కామిక్ బుక్ కవర్ లుక్ అదిరింది
- 23న ఎఫ్‌టీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం..
- శింబును వెలేసిన నిర్మాతల మండలి..?
- వేరుశనగ క్వింటాల్ @ రూ.7,712
- లైంగిక దాడి కేసులో వ్యక్తి 27 ఏళ్లు జీవిత ఖైదు
- ఈ 31లోపు అర్హులైన అందరికీ పదోన్నతులు : వి. శ్రీనివాస్ గౌడ్
- మీరారాజ్‌పుత్ హొయలు చూడతరమా..!
- ఉద్యమకారుడి కుటుంబానికి అండగా నిలిచిన ప్రభుత్వం
- ముందే కరోనా కట్టడిలో చైనా ఫెయిల్!