ఆదివారం 12 జూలై 2020
Sports - Jun 17, 2020 , 00:09:29

ఆ రెండే.. కోహ్లీ విజయసూత్రాలు: గౌతీ

ఆ రెండే.. కోహ్లీ విజయసూత్రాలు: గౌతీ

ముంబై: బ్యాట్స్‌మన్‌గా టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌  కోహ్లీ అత్యంత విజయవంతం అవడానికి ఫిట్‌నెస్‌, స్ట్రైక్‌  రొటేషన్‌  ప్రధాన కారణాలని మాజీ ఓపెనర్‌  గౌతమ్‌  గంభీర్‌  అన్నాడు. వెస్టిండీస్‌ విధ్వంసకారుడు క్రిస్‌ గేల్‌కు ఉన్న బలం, దక్షిణాఫ్రికా హార్డ్‌ హిట్టర్‌ ఏబీ డివిలియర్స్‌కు ఉన్న సామర్థ్యం లేకున్నా ఫిట్‌నెస్‌తోనే టీ20ల్లో కోహ్లీ అద్భుతంగా రాణించగలుగుతున్నాడని చెప్పాడు. కోహ్లీలా గేల్‌, ఏబీ , రోహిత్‌  శర్మ స్ట్రైక్‌  రొటేట్‌  చేయలేరని బుధవారం ఓ టీవీషోలో గౌతీ అభిప్రాయ పడ్డాడు. టెస్టులు, వన్డేలతో పాటు  టీ20ల్లోనూ విరాట్‌ 50కు పైగా సగటుతో  కొనసాగుతుం డడంపై గౌతీ ప్రశంసించాడు. ‘కోహ్లీ ఎప్పటికీ స్మార్ట్‌ క్రికెటర్‌. వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తడంలో అతడిని మించిన వారు లేరు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో ప్రతి బంతికి స్ట్రైక్‌ రొటేట్‌ చేసే సత్తా ఉన్న అతి కొద్ది మందిలో కోహ్లీ ముందువరుసలో ఉంటాడు. స్ట్రైక్‌ రొటేషన్‌ విషయంలో రోహిత్‌ కంటే విరాట్‌ చాలా మెరుగు’ అని గంభీర్‌ అన్నాడు. 


logo