బుధవారం 03 జూన్ 2020
Sports - Mar 29, 2020 , 23:58:40

గంభీర్‌ రూ.కోటి విరాళం

గంభీర్‌ రూ.కోటి విరాళం

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరాటం కోసం టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌.. ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి పీఎం - కేర్స్‌ నిధికి రూ.కోటిని విరాళంగా ప్రకటించాడు. దీంతో పాటు నెల వేతనాన్ని కేంద్ర సహాయ నిధికి అందించనున్నట్టు ట్విట్టర్‌లో ప్రకటించాడు. తూర్పు ఢిల్లీ ఎంపీగా ఉన్న గంభీర్‌ ఇదివరకే రూ.50లక్షలను ఎంపీ ల్యాడ్స్‌ నిధుల కింద ప్రధానమంత్రి సహాయ నిధికి అందజేశాడు. భారత టెస్టు స్పెషలిస్ట్‌ అజింక్య రహానే మహారాష్ట్ర సీఎం సహాయ నిధికి రూ.10లక్షలను విరాళమిచ్చాడు. 

15ఏండ్ల ఈషా విరాళం రూ.30వేలు 

కరోనాపై యుద్ధానికి సాయం చేసేందుకు తెలంగాణ యువ షూటర్‌ ఈషా సింగ్‌ సైతం ముందుకొచ్చింది. ప్రధానమంత్రి కేర్స్‌ నిధికి ఆమె రూ.30వేలు విరాళమిచ్చింది. దీనికి స్పందించిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు.. ఈషా సింగ్‌ను రియల్‌ చాంపియన్‌ అంటూ అభినందించారు. అలాగే టీమ్‌ఇండియా టీనేజ్‌ మహిళా క్రికెటర్‌ రిచా ఘోష్‌ పశ్చిమ బెంగాల్‌ సీఎం సహాయ నిధికి రూ.లక్షను అందించింది. 

హెచ్‌సీఏ రూ.50లక్షలు  

కరోనాను ఎదుర్కొనేందుకు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం(హెచ్‌సీఏ) రూ.50లక్షలను ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించింది.  కర్ణాటక క్రికెట్‌ సంఘం రూ.50లక్షలను పీఎం-కేర్స్‌కు, రూ.50లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది. 


logo