శనివారం 26 సెప్టెంబర్ 2020
Sports - Jul 10, 2020 , 12:38:49

పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత

పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత

హైదరాబాద్‌: యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. చౌటుప్పల్‌ సమీపంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఓ కారులో 86 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశామని, ఒకరు పరారీలో ఉన్నారని డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నర్సీపట్నం నుంచి ఉత్తరప్రదేశ్‌కు అక్రమంగా తరిస్తున్నారని తెలిపారు. నిందితుల నుంచి కారు, 12 మిక్సీలు, రూ.2 వేలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


logo