శుక్రవారం 07 ఆగస్టు 2020
Sports - Jul 05, 2020 , 14:58:57

భారత జట్టును మార్చింది గంగూలీనే: నాసర్‌ హుసేన్‌

భారత జట్టును మార్చింది గంగూలీనే: నాసర్‌ హుసేన్‌

ముంబై : గంగూలీ గొప్ప ఆటగాడు. మంచి కెప్టెన్‌ కూడా.. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా దాదా తనదైన ముద్ర వేస్తున్నాడు. యువ క్రికెటర్లను ప్రోత్సహించి వారిని జట్టు విజేతలుగా మలిచాడు. అతని సారధ్యంలో భారత జట్టు ఎన్నో విజయాలను సాధించింది. వాటిలో 2002 నాట్‌వెస్ట్‌ సరీస్‌ ఫైనల్‌ ఒకటి. అప్పటి యువ ఆటగాళ్లు యువరజా్‌, కైఫ్‌ మ్యాచ్‌ను గెలిపించారు. అప్పుడు గంగూలీ జెర్సీ విప్పి తిప్పడం గురించి అభిమానులు ఇప్పటికీ చెప్పుకుంటారు. తాజాగా ఇంగ్లాండ్‌ మాజా కెప్టెన్‌ నాసర్‌ హుసేన్‌ క్రికెట్‌ కనెక్టెడ్‌ అనే  ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గంగూలీ నాయకత్వాన్ని ప్రశంసించాడు. 

తాను రాక ముందే టీమిండియా ఆటగాళ్లు నైపుణ్యం కలిగి ఉన్నారన్నాడు. ‘గంగూలీ భారత్‌ను మంచి పోటీనిచ్చే జట్టుగా తీర్చిదిద్దాడు. ఆటగాళ్లంతా కలివిడిగా ఉండేవాళ్లు. గుడ్‌మార్నింగ్‌ నాసర్‌ అని టీమిండియా క్రికెటర్లు విష్‌ చేసేవాళ్లు. గంగూలీ సారధ్యంలో టీమిండియా ఆడడం ఓ యుద్ధాన్ని తలపించేది’ అని హుసేన్‌ పేర్కొన్నాడు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo