శుక్రవారం 15 జనవరి 2021
Sports - Jan 08, 2021 , 02:15:22

గంగూలీ డిశ్చార్జ్‌

గంగూలీ డిశ్చార్జ్‌

కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్‌ఇండియా మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ దవాఖాన నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు. గుండెపోటు రావడంతో యాంజియోప్లాస్టి చేయించుకున్న దాదా ఐదు రోజుల చికిత్స తర్వాత గురువారం ఇంటికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా అభిమానులు వందలాదిగా వుడ్‌ల్యాండ్‌ దవాఖాన వద్దకు వచ్చారు. బయటకు వచ్చాక గంగూలీ మాట్లాడాడు. ‘నేను పూర్తి క్షేమంగా ఉన్నా. త్వరలోనే ప్రయాణాలు సైతం చేస్తానని ఆశిస్తున్నా. డాక్టర్లు, నర్సులతో పాటు నాకు చికిత్స చేసిన అందరికీ ధన్యవాదాలు’ అని దాదా అన్నాడు. గంగూలీతో పాటు భార్య డోనా కూడా ఉన్నారు.  గత శనివారం జిమ్‌ చేస్తున్నప్పుడు గుండెనొప్పి రావడంతో 48 ఏండ్ల గంగూలీ దవాఖానలో చేరగా.. గుండె రక్తనాళాలు మూడు చోట్ల మూసుకుపోయినట్టు గుర్తించిన వైద్యులు యాంజియోప్లాస్టి చేశారు.