బుధవారం 08 జూలై 2020
Sports - Apr 24, 2020 , 12:24:46

పనిమనిషి అంత్యక్రియలు నిర్వహించిన గంభీర్​

పనిమనిషి అంత్యక్రియలు నిర్వహించిన గంభీర్​

న్యూఢిల్లీ: టీమ్​ఇండియా మాజీ ఆటగాడు, తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతమ్​ గంభీర్ తన మంచి మనసు చాటుకున్నాడు. తన ఇంట్లో పని చేస్తున్న సహాయకురాలి అంత్య క్రియలను గంభీర్ నిర్వహించాడు. సరస్వతి పాత్ర ఆరేండ్లుగా గంభీర్ ఇంట్లో సహాయకురాలిగా పని చేస్తున్నారు. అనారోగ్యం కారణంగా ఓ దవాఖానలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.  ప్రస్తుతం లాక్​డౌన్ ఉన్న కారణంగా మృత దేహాన్ని ఒడిశాలోని అమె కుటుంబానికి పంపలేని పరిస్థితి. దీంతో గంభీర్ స్వయంగా అంత్యక్రియలు నిర్వహించాడు. ఈ విషయాన్ని శుక్రవారం ట్విట్టర్ ద్వారా గౌతీ ధృవీకరించాడు.

“నా పిల్లలను జాగ్రత్తగా చూసుకున్న ఆమె ఎప్పటికీ పని మనిషికాదు. ఆమె నా కుటుంబ సభ్యురాలు. ఆమె అంత్యక్రియలు నిర్వహించడం నా బాధ్యత. కులం, మతం, ప్రాంతం, సామాజిక పరిస్థితులతో సంబంధం లేకుండా అందరినీ గౌరవించాలని నేను ఎప్పుడూ నమ్ముతాను. అదే నా దేశం ఆలోచన. ఓ శాంతి” అని గంభీర్ ట్వీట్ చేశాడు. గౌతమ్ గంభీర్​ను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు.

49ఏండ్ల సరస్వతి పాత్ర తీవ్రమైన రక్తపోటు కారణంగా కొన్ని రోజుల క్రితం శ్రీరామ్ గంగ దవాఖానాలో చేరారు. అనారోగ్యం తీవ్రమవడంతో ఈనెల 21వ తేదీన ఆమె కన్నుమూశారు.  


logo