మంగళవారం 04 ఆగస్టు 2020
Sports - Jul 03, 2020 , 12:51:01

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు విండీస్‌ జట్టిదే..

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు విండీస్‌ జట్టిదే..

సౌతాంప్టన్‌: కరోనా కారణంగా నాలుగు నెలలుగా నిలిచిపోయిన క్రికెట్‌ ఎట్టకేలకు ఇంగ్లాండ్‌లో మొదలైంది. వెస్టిండీస్‌తో మూడు టెస్టుల సిరీస్‌ కోసం సన్నద్ధమయ్యేందుకు ఇంగ్లాండ్‌    జట్టు రెండు టీమ్‌లుగా విడిపోయి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడింది. ఈనెల 8వ తేదీ నుంచి ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌   మధ్య ప్రారంభమయ్యే తొలి టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌ మళ్లీ ఆరంభంకాబోతున్నది. 

ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు విండీస్‌ 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. చీలమండ శస్త్రచికిత్స చేయించుకొని  కోలుకున్న పేసర్‌ షానన్‌ గాబ్రియేల్‌ మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. రిజర్వ్‌ ఆటగాడిగా ఇంగ్లాండ్‌కు వచ్చిన గాబ్రియేల్‌  ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌లో జరిగిన  రెండు వామప్‌ మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసి ఫిట్‌నెస్‌ నిరూపించుకున్నాడు. దీంతో  టీమ్‌ మేనేజ్‌మెంట్‌   స్పీడ్‌స్టర్‌కు  అవకాశం ఇచ్చింది. 

విండీస్‌ టెస్టు జట్టు:

జేసన్‌ హోల్డర్‌(కెప్టెన్‌), బ్లాక్‌వుడ్‌, బానర్‌, బ్రాత్‌వైట్‌, బ్రూక్స్‌, క్యాంప్‌బెల్‌, రోస్టన్‌ ఛేజ్‌, కార్న్‌వాల్‌, డౌరిచ్‌, గాబ్రియేల్‌, చెమర్‌ హోల్డర్‌, షైహోప్‌, అల్జారీ జోసెఫ్‌, రేమన్‌ రీఫర్‌, కెమర్‌ రోచ్‌

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo